ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌…..! బీజేపీ అంత ప‌ని చేస్తోందా…!

-

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందా..? అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ పెద్ద‌లు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ BJP-partyకేజ్రీవాల్ లిక్క‌ర్ స్కామ్‌లో జైలు పాలైన నేప‌థ్యంలో ఇలాంటి వార్త‌లు వినిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.ఓవైపు లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుతున్న వేళ ఆప్ పార్టీకి ఇది ప్ర‌తికూలం కానుంది. ఈ మేర‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ద్వారా కేంద్రంలోని బీజేపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈమేరకు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ను పదవి నుంచి తప్పించేలా కేంద్రం తెరవెనక గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బీజేపీ రాజకీయాలను ముందుగానే అంచనా వేసిన అరవింద్ కేజ్రీవాల్..తానే స్వ‌యంగా పదవి నుంచి తప్పుకొని తన భార్యను సీఎం చేయాలనుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించాలని బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈమేరకు పిల్ కూడా దాఖలు చేశారు. అరెస్ట్ అయ్యాక సీఎం పదవిలో కొనసాగాలా వద్దా..? అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయం.దీనిపై ఎలాంటి జోక్యం చేసుకోలేమ‌ని … ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వ‌లేమ‌ని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రపతి లేదా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించాలని సూచించింది. అదే సమయంలో ఢిల్లీ సర్కార్ టార్గెట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ రాజకీయ విమర్శలు కూడా స్టార్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారంపై ఆప్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.ఢిల్లీలో ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్ పై ఉందని త‌క్ష‌ణ‌మే కేజ్రీవాల్‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.ఆప్ ను బద్నాం చేసేందుకు ఢిల్లీ గవర్నర్ ద్వారా బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రబుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి అతిషి ఇటీవ‌ల వ్యాఖ్యానించడం సంచ‌ల‌నంగా మారింది. ఈమేరకు అధికారులను ప్రభుత్వ సమావేశాలకు వెళ్ళకూడదనే ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు. ఢిల్లీలో ప్రభుత్వం గాడితప్పినట్టు ముద్రవేసి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించే వ్యూహంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఢిల్లీలో రాజ‌కీయాలు మరింత ఆస‌క్తిగా మారుతున్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news