ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టించిన బన్ని ఫ్యాన్..

-

సోషల్ మీడియా వేదికగా ఎంత మంచి ఉందో.. అంతే చెడు ఉంది. సరిగ్గా వాడుకుంటే దీనికి మించింది మరొకటి లేదు. కానీ తేడా వస్తే దినంతా డేంజర్ కూడా మరొకటి లేదు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్నో మోసాలు జ‌రుగుతున్నాయి. అందుకు ఉదాహరణకు ఈ సంఘటన నిదర్శనం.. తాజాగా సామాజిక మాధ్యమాల సాక్షిగా ఒక వ్యక్తి అల్లు అర్జున్ అభిమాని అంటూ మిగతా బన్ని ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టించాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. బన్ని విజయ్ అనే అల్లు అర్జున్ అభిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా తాను అల్లు అర్జున్ అభిమానిన‌ని.. తనకి యాక్సిడెంట్ అయిందని తనకి సహాయం చేయాలనీ కోరాడు.

అతని కోరిక మేరకు అల్లు అర్జున్ ఫాన్స్ చాలా మంది కలిసి అతని అకౌంట్స్ లోకి డబ్బులు పంపించారు. దాదాపుగా అందరు కలిసి ముప్పై లక్షల వరకు పంపించినట్టు తెలుస్తుంది. అయితే అతని ఆరోగ్యం గురించి ఎలా ఉందో తెలుసుకుందామని ట్రై చేయగా అసలు బన్ని విజయ్ అనే వ్యక్తే లేడని అదో ఫేక్ ఎకౌంటు అని, కేవలం డబ్బులకోసం మాత్రమే అతను ఇలా పోస్ట్ పెట్టాడని తెలుసుకున్నారు. బన్ని విజయ్ ఇలా చేయడంతో నిజంగా సహాయం కోరే వారిని కూడా నమ్మలేకపోతున్నాం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news