ఇండియన్-2కు వరుస బ్రేకులు.. మళ్లీ మొదటికొచ్చిన విబేధాలు!

మొదలు పెట్టిన నెలలోపే ఆగిపోయిందన్నరు. ఏ అలాంటిదేం లేదు. ఆగిపోలేదు అని క్లారిటీ ఇచ్చారు. అంతలోపే డైరెక్టర్ కు నిర్మాతలకు విభేదాలు వచ్చాయి. దీంతో మళ్లీ బ్రేక్ పడింది. నిర్మాతలు కోర్టుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత డైరెక్టర్ సినిమా చేస్తామంటూ చెప్పేశాడు. హమ్మయ్య అని అనుకునే లోపే ఇప్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా.. అదేనండి మన ఇండియన్-2 గురించి.

ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శంకర్ సినిమాలంటేనే ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక కమల్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు ప్లస్ పాయింట్లతో పాటు మరో విషయం ఏంటంటే.. భారతీయుడు మూవీ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

మరి దానికి సీక్వెల్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో కదా. మరి ఆ సినిమాకు అప్పట్లో డైరెక్టర్ కు నిర్మాతలకు విబేధాలు రావడంతో బ్రేక్ పడింది. శంకర్ రామ్ చరణ్ తో మూవీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. దీంతో నిర్మాతలు కోర్టుకు వెళ్లగా.. ఈ సినిమాను జూన్ లోపు పూర్తి చేయాలని ఇరు వర్గాలు డిసైడ్ అయ్యాయి. సినిమాలో ఎలాంటి మార్పులు ఉండకూడదని నిర్మాతలు కండీషన్ లు పెట్టడంతో డైరెక్టర్ శంకర్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మళ్లీ ఆగిపోయింది. మరి వేరే అప్ డేట్ ఏమైనా వస్తుందో చూడాలి.