మంత్రికి మైండ్ పోయిందా… డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో బిజెపి నేతల మెయిన్ టార్గెట్ తెరాస నేతలు, మంత్రులు. వాళ్ళ విషయంలో బిజెపి ఘాటు విమర్శలు చేస్తుంది. తాజాగా మంత్రి ఈటలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. మంత్రి పదవి పోతోందన్న భయం ఈటలలో కన్పిస్తోందని విమర్శలు చేసారు. ఈటల మాటలు చూస్తోంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కల్గుతున్నాయి అని అన్నారు.

అడిగిన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తోందని కేంద్రాన్ని పొగిడిన ఈటల మాట మార్చారెందుకు? అని నిలదీశారు. మతి భ్రమించే మంత్రి ఈటల మాట మార్చారా? అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలన్న తాపత్రయం తప్ప ఈటలకు కరోనా రోగుల పట్ల సోయి లేదు అని అన్నారు. గడికో మాట మార్చటం వలన ఈటలపై ఉద్యమకారుడన్న గౌరవం పోతోంది అని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఈటెలకు ఆమె లేఖ కూడా రాసారు.