నిజంగానే యంగ్ వ‌ర్సెటైల్ హీరో అనిపించుకుంటున్నాడు..!

-

అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌రైనోడులో అత్యంత శ‌క్తివంత‌మైన విల‌న్ వైర‌మ్ ధ‌నుష్ పాత్ర‌లో విశ్వ‌రూపం చూపించారు. నిన్నుకోరిలో సెకండ్ హీరోగా సెటిల్డ్ న‌ట‌న‌తో మెప్పించి, త‌న‌లోని మ‌రో యాంగిల్‌ని చూపించారు.

ఆది పినిశెట్టి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడిగా తెరంగేట్రం చేశారు. తొలి సినిమా ఒక విచిత్రం(2006)తో హీరోగా కాకుండా న‌టుడిగానే తానేంటో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు. దాదాపు ఓ తొమ్మిది సినిమాలు త‌మిళంలో న‌టించి, మ‌లుపుతో దాదాపు ప‌దేండ్ల త‌ర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇది న‌టుడిగా ఆదికి మంచి నేమ్ తీసుకొచ్చింది. అట్నుంచి త‌న రూట్ మార్చారు. హీరోగానే కాకుండా ఓ యాక్ట‌ర్‌గా నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

Aadhi pinishetty is really a versatile actor

అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌రైనోడులో అత్యంత శ‌క్తివంత‌మైన విల‌న్ వైర‌మ్ ధ‌నుష్ పాత్ర‌లో విశ్వ‌రూపం చూపించారు. నిన్నుకోరిలో సెకండ్ హీరోగా సెటిల్డ్ న‌ట‌న‌తో మెప్పించి, త‌న‌లోని మ‌రో యాంగిల్‌ని చూపించారు. ఇక పవ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అజ్ఞాత‌వాసిలో నెగ‌టివ్ పాత్రలో ఆక‌ట్టుకున్నాడు. ఇది అంత‌గా పేరు తీసుకురాలేక‌పోయింది.

ఇక విల‌న్ పాత్ర‌ల‌ని ప‌క్క‌న పెట్టి రామ్‌చ‌ర‌ణ్ -సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్‌కి అన్న‌గా, కుమార బాబు పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ఒకానొక ద‌శ‌లో చ‌ర‌ణ్‌నే డామినేట్ చేశాడు. ఇందులోని కుమార బాబు పాత్ర ఆడియెన్స్ కి గుర్తిండిపోయింది. యూట‌ర్న్ లో పోలీస్‌గా, నీవెవ‌రులో గుడ్డివాడిగా ఇలా వ‌రుస‌గా సినిమా సినిమాకి వేరియేష‌న్ చూపిస్తూ వ‌ర్సెటైల్ యాక్టింగ్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

యంగ్ హీరోల్లో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు మారుపేరు అవుతున్నారు. ఇదిలా ఉంటే త‌న వ‌ర్సెటాలిటీకి మ‌రో ఎక్సాంపుల్ ఇవ్వ‌బోతున్నారు. తాజాగా ఆయ‌న స్పోర్ట్స్ బేస్డ్ చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. పృథ్వీ ఆదిత్యని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఈ న‌యా మూవీ చేయ‌నున్నారు. దీన్ని తెలుగు, త‌మిళంలో బైలింగ్వ‌ల్ చిత్రంగా తెర‌కెక్కించ‌నున్నారు. మ‌రోవైపు తెలుగు సూప‌ర్ హిట్‌ ఆర్ ఎక్స్ 100 త‌మిళ రీమేక్‌లో యాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్న‌ విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news