ప్రముఖ సినీ నటులు ఆది పినిశెట్టి, నిక్కీ గాల్రాని దంపతులైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది మే లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఇప్పటికే తమ వెడ్డింగ్ స్టిల్స్ ను అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు సంతోషాన్ని కలుగ చేస్తుండగా.. మరొకవైపు తమ వెడ్డింగ్ వీడియో టీజర్ ను కూడా విడుదల చేశారు. ఇక మా పెళ్లి అయి మూడు నెలలు అవుతుంది. కానీ నిన్ననే ఇదంతా జరిగినట్టుంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది.. దానికి సంబంధించిన మరిన్ని వీడియోలను త్వరలోనే మీ ముందుకు తెస్తాము అంటూ తెలిపారు.
ఈ జోడి పెళ్లికి ముందు , పెళ్లి పీటలపై ఎంత సందడి చేసిందో ఈ టీజర్ చూస్తేనే మనకు తెలుస్తుంది .ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. నిక్కీ, ఆది తమ పెట్ డాగ్స్ తో ఫోటోలో దిగడం, వధూవరులు లాగా తయారవడం, డాన్స్ చేయడం, హల్దీ ఫంక్షన్ తదితర మధుర ఘట్టాలన్నింటిని ఈ వీడియోలో చాలా షార్ట్ గా చూపించారు. ఇక హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్ తదితరులు వారికి తోడై వేడుకలలో మరింత జోష్ నింపారు. ఇక ఈ పెళ్లికి హాజరైన మరికొంతమంది తారలు, రాజకీయ నేతల క్లిప్పింగ్స్ తదితర వీడియోలలో చూపించే అవకాశం ఉందని సమాచారం.