Aadikeshava : ‘ఆదికేశవ’ ట్రైలర్‌ రిలీజ్‌..వైష్ణవ్‌తేజ్‌ దుమ్ములేపాడు

-

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే చక్కటి విజయాన్ని అందుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విడుదలైన ‘కొండ పొలం’ మూవీకి మంచి టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Aadikeshava Theatrical Trailer

ఇప్పుడు తాజాగా నవంబర్ 24వ తేదీన ఈ ఆది కేశవ సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో ఈ సినిమా పైన హైప్ పెంచడానికి ఆదికేశవ ట్రైలర్ సినిమాను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అల్లరి ముఖాగా తిరిగే యువకుడు ఆ తర్వాత హీరోయిన్ ని చూసి ప్రేమలో పడి విలన్ గా వచ్చేవారిని ఎదుర్కొనడం జరిగినట్టుగా చూపించారు. రెగ్యులర్ గా మాస్ హీరో చేసే కమర్షియల్ సినిమా తరహాలోనే ఈ ఆదికేశవ సినిమా ట్రైలర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version