ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌ లైఫ్‌) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. వేసవి కానుకగా మార్చి నెలాఖరులో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ‘ఆడు జీవితం’ ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 19వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.  ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మలయాళంతోపాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2008లో అత్య‌ధికంగా అమ్ముడైన మ‌ల‌యాళ న‌వ‌ల ‘గోట్ డేస్‌’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version