ఛత్రపతి రీమేక్ చేస్తాడట..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా గుర్తుంది కదా. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ మాస్ స్టార్ గా మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ సినిమా రీమేక్ చేయాలని ఉందని అంటున్నాడు బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్.

కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆడేస్తున్నాయి. ఇక్కడ సినిమాలు అక్కడ రీమేక్ అవడం స్పెషల్ అనిపిస్తుంది. ఇండియన్ సినిమాపై తెలుగు సినిమాల ప్రభావం చాలా ఉంది. బాహుబలి తర్వాత టాలీవుడ్ అంటే బాలీవుడ్ వాళ్లు కూడా భయపడేలా పరిస్థితి తయారయ్యాయి.

అందుకే ఇక్కడ హిట్టైన సినిమాలు ఏరి కోరి అక్కడకు తీసుకెళ్తున్నారు. యూనివర్సల్ సబ్జెక్ట్ అనిపిస్తే చాలు రీమేక్ చేసేస్తున్నారు. ఛత్రపతి సినిమా అన్ని హంగులున్న సినిమా.. ఆ సినిమా రీమేక్ చేయాలని అనుకుంటున్నా అని అభిషేక్ వ్యక్తం చేశారు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఏ దర్శకుడు అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news