కొత్త సినిమా టీజర్ తో హంగామా చేస్తున్న చోటా బచ్చన్

-

బిగ్ బి అమితాబ్ బచ్చన్, నటి మరియు రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ల నట వారసుడిగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ పలు వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా అభిషేక్ నటిస్తున్న కొత్త చిత్రం దస్వి . దినేష్ విజయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ గంగా రామ్ చౌధురీ పాత్రలో నటిస్తున్నాడు. సోమవారం ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యింది.
టీజర్ చూపించిన ప్రకారం ఈ సినిమా కథ  గ్రామీణ నేపథ్యం కలిగినది మరియు విద్య విలువ గురించి  తెలియజేసే చిత్రంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీజర్ లో మధ్య వయస్సు లో ఉన్న అభిషేక్ 10 వ తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న సన్నివేశం కనిపించింది.
దస్వి టీజర్ ను చూసిన తండ్రి అమితాబ్ బచ్చన్ , మేనకొడలు నవ్య నందాలు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో అభిషేక్ సరసన హీరోయిన్ గా యామి గౌతమ్ నటిస్తుండగా , నీమ్రత్ కౌర్ కీలకమైన పాత్ర పోషింస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news