ఆచార్య రిలీజ్ ఎప్పుడంటే…!

-

ఆచార్య సినిమా కోసం మెగా ఫాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఆచార్య సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే అభిమానులు ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఆచార్య సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. కీలక సన్నివేశాల కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన గురించే సినిమా షూటింగ్ ఇప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఇక కథలో కూడా కొన్ని మార్పులను కొరటాల శివ చేస్తున్నట్టు సమాచారం. విదేశాల్లో షూటింగ్ వద్దని భావిస్తూ ఎపీలోనే సాధ్యమైనంత వరకు షూటింగ్ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కీలక సన్నివేశాల కోసం అందమైన అటవీ ప్రాంతాలను ఎంచుకోవాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. తాజాగా మీడియా కు అందిన సమాచారం ఈ సినిమాను ఈ ఏడాది దసరా కు విడుదల చెయ్యాలి అని చూస్తున్నట్టు సమాచారం. దసరా కు చిరంజీవి సినిమా వచ్చి చాలా రోజులు అయింది. ఈ పండగకు సినిమాను విడుదల చేస్తే మంచి మార్కెట్ దేశ వ్యాప్తంగా ఉంటుంది అని భావిస్తున్నారట. మరి షూటింగ్ పూర్తి అవుతుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news