రేసింగులో మరో రికార్డు నెలకొల్పిన అజిత్‌

-

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్ ప్రొఫెనల్‌ రేసర్‌ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన టీమ్‌తో కలిసి మరో ఘనత సాధించారు. బెల్జియంలో నిర్వహించిన స్పా- ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్‌ సర్క్యూట్‌లో ఆయన టీమ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఆ టీమ్ సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. సినిమా అయినా, స్పోర్ట్స్‌ అయినా అజిత్‌ ఉన్న చోట పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుందని ఓ వీడియో షేర్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు అజిత్‌కు విషెస్‌ తెలియజేస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన 24హెచ్‌ దుబాయ్‌ కారు రేసింగ్‌లో అజిత్‌ పాల్గొన్నారు. ఆ పోటీల్లో అజిత్‌ టీమ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఇటలీలో ఇటీవల జరిగిన 12హెచ్‌ రేస్‌లోనూ థర్డ్ ప్లేసుకు పరిమితమైంది. ఇక తాజాగా బెల్జియంలో నిర్వహించిన స్పా- ఫ్రాన్‌కోర్‌ఛాంప్స్‌ సర్క్యూట్‌లో రెండో స్థానం దక్కించుకుంది. ఇక సినిమాల సంగతికి వస్తే అజిత్ నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఈ నెల 10న విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news