భార్యాభర్తల సంబంధం బాగుండాలంటే ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి. అయితే చాలా శాతం వరకు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడానికి మూడవ వ్యక్తి కారణం అవుతారు. కనుక అలాంటి వ్యక్తులను ముందుగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటేనే ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు. సహజంగా భార్యాభర్తలు మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. కాకపోతే మూడవ వ్యక్తి భార్య భర్తల మధ్య వచ్చినప్పుడు మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పులు కనిపించవచ్చు.
కనుక వాటిని ముందుగా గుర్తించి ఎంతో తెలివిగా వ్యవహరించాలి. ఎప్పుడైతే మీ భాగస్వామి ఇంటికి ఆలస్యంగా రావడం, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం, చిరాకుగా మాట్లాడడం వంటివి చేస్తారో మూడవ వ్యక్తి మీ ఇద్దరి మధ్య వచ్చినట్టే. ఒకవేళ మూడవ వ్యక్తి ఉన్నారని కొన్ని కారణాల ప్రకారం నిర్ణయిస్తే పొరపాటు చేసినట్టే అవుతుంది. ఎందుకంటే అనుమానం సరైనదా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. నేరుగా గొడవ పడడం వలన మరింత ప్రమాదంగా మారుతుంది. కనుక మూడవ వ్యక్తి గురించి మీ మధ్య ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఎప్పుడైతే మీ భాగస్వామి మిమ్మల్ని దూరంగా పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో, అప్పుడు ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తించాలి.
మీ భాగస్వామి ఇతరుల గురించి లేక మూడవ వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్లయితే, ఆ వ్యక్తితో ఉండే సంబంధాన్ని సూచించే అవకాశముంది. ఎందుకంటే మూడవ వ్యక్తితో ఎటువంటి సంబంధం లేకుండా ఇతరుల విషయాల గురించి పదే పదే ఎవ్వరూ మాట్లాడటం. సహజంగా భార్యాభర్తలల మధ్యలో పిల్లలు, ఆఫీస్ విషయాల గురించి కాకుండా ఇతర విషయాలు గురించి సంభాషణ వస్తే తప్పకుండా గమనించాలి. అంతేకాకుండా మీ భాగస్వామి అందం, డ్రెస్సింగ్, ఆహారంలో మార్పులు గురించి కూడా గమనించి, వాటికి గల కారణాలను తెలుసుకోవాలి. ఇటువంటి మార్పులు ప్రవర్తనలో కనిపించినప్పుడు, దంపతుల మధ్య మూడవ వ్యక్తి ప్రభావం ఉందని అర్థం చేసుకోవచ్చు.