రియల్ ఎస్టేట్ మోసాలతో జాగ్రత్త : జగపతి బాబు

-

రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మోసాలు జరుగుతున్నాయని ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నారు. ఆ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు సూచించారు. దానికి తానూ బాధితుడినేనని వాపోయారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టి అభిమానులను జగపతిబాబు అప్రమత్తం చేశారు.

‘రియల్‌ ఎస్టేట్‌లో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆ విషయం చెప్పారు. ఇటీవల నేను స్థిరాస్తి రంగానికి సంబంధించి ఓ యాడ్‌లో నటించా. నన్నూ మోసం చేశారు. వారెవరు? ఏం జరిగింది? అన్నది త్వరలోనే చెబుతా. ల్యాండ్‌ కొనేముందు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తెలుసుకోండి’’ అని జగపతి బాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఇక జగపతిబాబు సినిమాల సంగతికి వస్తే.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’, ‘మిస్టర్‌ బచ్చన్‌’ తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news