గుండె బరువెక్కింది అంటూ నాని ఎమోషనల్ పోస్టు

-

నేచురల్ స్టార్ నాని సినిమా కెరీర్‌లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటి ‘జెర్సీ’. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్‌ షో వేశారు. నాని తన భార్య అంజనాతో కలిసి ఈ సినిమాను మళ్లీ చూశారు. అయితే థియేటర్లో అభిమానులు చూపించిన ఆదరణ పట్ల నాని ఎమోషనల్ అయ్యాడు.

‘‘ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానులు ఆదరణ చూస్తుంటే.. మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్‌ (సినిమాలో తన పాత్ర పేరు) తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది’’ అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు. ఇందులో ఆయన క్రికెటర్‌గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాను గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించారు.

ఇక నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news