ప్రతినిధి-2 టీజర్ రిలీజ్.. ఎన్నికల వేళ నారా రోహిత్ పవర్ ఫుల్ పంచ్

-

టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా చేసిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు యంగ్ హీరో నారా రోహిత్. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నిటికి ఒకదానితో ఇంకొక దానికి సంబంధం ఉండదు. ఆయన సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే నమ్మకంతో ప్రేక్షకులు చూస్తుంటారు. ఆయన కెరీర్లో కమర్షియల్గా కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుని, ప్రేక్షకుల చేత నీరాజనాలు పట్టించుకున్న సినిమా ప్రతినిధి. పొలిటకల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది.

ఇప్పుడు దానికి సీక్వెల్గా ప్రతినిధి-2తో నారా రోహిత్ వస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్గా తెరెకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజైంది. కళ్లు తెరిచుంటే ఓటు వేయు.. లేదంటే చచ్చిపో అంటూ నారా రోహిత్ చెప్పే డైలాగ్ ఈ టీజర్కు హైలైట్. జనం కోసం బతికితే.. చచ్చాక కూడా జనంలోనే ఉంటావు అనే డైలాగ్ కూడా చాలా బాగుంది. ఇక ట్రైలర్ చివరలో నారా రోహిత్ చెప్పే డైలాగ్ సూపర్. మరి ఓసారి మీరూ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version