ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్ర బాబు నాయుడు నీతి అయోగ్ పై మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చంద్రబాబు పచ్చి అబద్దాలు చేశారు. మాజీ సీఎం జగన్ తక్కువ అప్పులు చేశారు. 14లక్షల కోట్లు అప్పులు చేశారని ఊదరగొట్టారు. 2024 వరకు ఏపీ అప్పు 6లక్షల కోట్లు అని తెలిపారు అంబటి రాంబాబు.
చంద్రబాబు దావోస్ కు ఎందుకు వెల్లారు. పైసా పెట్టుబడి లేకుండా ఎలా తిరిగొచ్చారని ప్రశ్నించారు. గతంలో గ్లోబల్ పెట్టుబడుల్లో రూ.10లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు. ఆ పది లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలు పై చంద్రబాబు ప్రకటించడం మోసమేనన్నారు. ఎన్నికల ముందు హామీలు ఎందుకు ఇచ్చారు.. ప్రజలను మోసం చేయడానికి కాదా..? అని ప్రశ్నించారు అంబటి.