ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందని.. సంక్షేమ పథకాల అమలు పై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. నీతి అయోగ్ నివేదిక పై సచివాలయంలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని వెల్లడించారు. ఆలోచించనని.. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నట్టు వివరించారు.
ఆర్థిక పరిస్తితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ఇస్తామని తెలిపారు చంద్రబాబు. అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదని.. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే ప్రజలే బాధపడతారని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి తెలియదా..? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొని ఇలాంటి మాటలేంటని నిలదీస్తున్నాయి.