స్కై డైవింగ్ చేస్తుండ‌గా.. న‌టుడు శ‌ర్వానంద్‌కు గాయాలు..

-

థాయ్‌లాండ్‌లో 96 మూవీలోని ప‌లు సీన్ల‌కు గాను శ‌ర్వానంద్ స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే రెండు రోజులుగా అత‌ను బాగానే ప్రాక్టీస్ చేసినా.. ఇవాళ మాత్రం డైవింగ్ స‌మ‌యంలో కాళ్ల‌తో కాకుండా భుజాల‌తో త‌ప్పుగా ల్యాండ్ అయ్యాడు.

త‌మిళంలో హిట్ టాక్ సాధించిన 96 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం విదిత‌మే. కాగా తెలుగు రీమేక్‌లో శ‌ర్వానంద్‌, స‌మంత‌లు న‌టిస్తున్నారు. త‌మిళంలో 96 మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్ష‌న్‌కు కూడా డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం థాయ్‌లాండ్‌లో జ‌రుగుతుండ‌గా.. షూటింగ్ స‌మ‌యంలో హీరో శ‌ర్వానంద్ గాయ‌ప‌డ్డాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.

థాయ్‌లాండ్‌లో 96 మూవీలోని ప‌లు సీన్ల‌కు గాను శ‌ర్వానంద్ స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే రెండు రోజులుగా అత‌ను బాగానే ప్రాక్టీస్ చేసినా.. ఇవాళ మాత్రం డైవింగ్ స‌మ‌యంలో కాళ్ల‌తో కాకుండా భుజాల‌తో త‌ప్పుగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అత‌ని కాళ్లు, భుజాల‌కు గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో శ‌ర్వానంద్‌ను హైద‌రాబాద్‌లోని స‌న్‌షైన్ ఆసుప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. అయితే గాయాలు స్వ‌ల్పంగానే అయిన‌ట్లు స‌మాచారం అందుతోంది.

కాగా ఇటీవ‌లే టాలీవుడ్ హీరోలు వ‌రుస‌గా గాయాల బారిన ప‌డుతున్నారు. మొన్నీ మధ్యే రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌లు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ‌గా, 2 రోజుల కింద‌ట నాగ‌శౌర్య కూడా గాయాల పాల‌య్యాడు. ఇప్పుడు స్కై డైవింగ్ చేస్తూ శ‌ర్వానంద్‌కు కూడా గాయ‌ల‌య్యాయి. దీంతో ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version