సోషల్ మీడియాకు దూరం కావడంపై హీరో సిద్దార్థ్‌ సంచలన కామెంట్స్

-

నటుడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మ్యాటర్ ఏదైనా సరే సామాజిక మాధ్యమాల వేదికగా తను రియాక్ట్ అవుతుంటాడు. కొన్నిసార్లు తన రియాక్షన్ కాంట్రవర్సీలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విటర్​లో యాక్టివ్​గా ఉండే సిద్ధార్థ్ కొంతకాలంగా ట్విటర్​కు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు.

‘‘యాక్టివిస్ట్‌ అనే పదం నాకు సరదాగా అనిపిస్తుంది. నేను కేవలం వాస్తవం వైపు నిలబడి నా గళాన్ని వినిపిస్తుంటాను. ఒక నటుడిగా ఎంతోకాలం నుంచి పలు విషయాలపై నా వాయిస్‌ వినిపించాను. నా సహ నటీనటులెవరూ నాకు తోడు రావడం లేదు. అలాగే.. ‘సిద్దార్థ్‌ ఒక్కడే మాట్లాడుతున్నారు. మీరెందుకు మీ గొంతు విప్పడం లేదు?’ అని వాళ్లను ఎవరూ ప్రశ్నించడం లేదు. అందుకే నేను కాస్త వెనక్కి తగ్గాను. ఒక్కడినే ఎందుకు మాట్లాడాలనిపించింది. ప్రపంచంలో ఉన్న దుష్టశక్తులపై నేనొక్కడినే పోరాటం చేయలేను. నేనేమీ సూపర్‌హీరోని కాదు. మరోవైపు, నాపై ఎంతోమంది ఫిల్మ్‌మేకర్స్‌ పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి, వారికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని సిద్దార్థ్‌ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news