BREAKING : ఏపీలో బీర్ల వ్యాన్‌ బోల్తా..బాటిళ్ల కోసం ఎగబడిన జనాలు..వీడియో వైరల్

-

ఏపీలో బీర్ల వ్యాన్‌ బోల్తా పడింది. దీంతో బీర్‌ బాటిళ్ల కోసం ఎగబడ్డారు జనాలు. ఏపీలోని అనకాపల్లిలో ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. దీంతో బీరుల కోసం పరుగులు తీశారు జనం. అనకాపల్లిలోని కసింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బీర్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా కొట్టింది. అనకాపల్లి డిపో నుంచి నర్సీపట్నం డిపోకు వెళ్తుండగా బోల్తా పడింది వ్యాన్.

ఈ తరుణంలోనే.. 200 కేసుల బీర్ బాటిల్స్ నేలపాలు అయ్యాయి. రోడ్డుపై పడిపోయాయి బీర్ బాటిల్స్. బీరు బాటిళ్లను తీసుకునేందుకు ఎగబడిన జనం.. దొరికిన కాడికి తీసుకెళ్లారు. ఇక ఈ సంఘటనపై తెలియడంతో… పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి జనాలను కంట్రోల్‌ చేయడంతో. అదుపులోకి వచ్చింది పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news