నాపై ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకెళ్తా.. నటుడు శ్రీకాంత్ వార్నింగ్

-

బెంగుళూరు ఫామ్ హౌజ్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసులో ముగ్గురు తెలుగు సినిమా నటులు దొరికినట్లు నగర పోలీసులు చెబుతున్నారు. నటి హేమ తోపాటు.. శ్రీకాంత్ మేక, అషి రాయ్ లకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఈ ముగ్గురికి నోటీసులు పంపి సీసీబీ హెబ్బగుడి పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపినట్లు తెలిసింది.

అయితే ఈ వ్యవహారంపై తాజాగా నటుడు శ్రీకాంత్ మరోసారి స్పందించారు. తనకు ఆ రేవ్ పార్టీకి సంబంధం లేదని మరోసారి తేల్చి చెప్పారు. తాను ఇంతకుముందు చెప్పినట్లు రేవ్ పార్టీకి వెళ్లలేదని, అక్కడ జరిగిన దానికి తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే తనపై తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తన పరువుకు భంగం కలిగించేలా రాసే సంస్థలపై కోర్టుకు కూడా వెళ్తానని అన్నారు. మరోవైపు రేవ్ పార్టీ, డ్రగ్స్ వంటి వాటి జోలికి యువత వెళ్లకూడదని, ఆ దిశగా వారికి మీడియా సంస్థలు అవగాహన కల్పించాలని శ్రీకాంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news