మండపంలోనే వధువుకు వరుడి ముద్దు.. ఇరు కుటుంబాల పరస్పర దాడి

-

ఓ వరుడి అత్యుత్సాహంతో పెళ్లి మండపం రణరంగంగా మారింది. వరమాల క్రతువు పూర్తయిన తర్వాత ఆ వరుడు అందరిముందే వధువును ముద్దు పెట్టుకోవడం గొడవకు దారి తీసింది. ఈ వ్యవహారంతో ఇరు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?

ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్‌లోని అశోక్‌నగర్‌లో ఒకేరోజు ఏర్పాటు చేశారు. ఒక కుమార్తె వివాహం పూర్తయిన కాసేపటికి మరొకరిది ప్రారంభించారు. వరమాల వేయడం పూర్తయిన తర్వాత వరుడు, వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టడంతో కంగుతిన్న వధువు బంధువులు వరుడి తీరుపై ఫైర్ అయ్యారు. వధువు బంధువులు వరుడు, అతడి కుటుంబసభ్యులపైన దాడికి దిగగా.. అవతలి వారూ ప్రతిదాడికి దిగడంతో కల్యాణ వేదిక కాస్త రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బహిరంగంగా దాడికి పాల్పడినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news