నా భార్య నెంబర్ అతని దగ్గర ఉంది, తప్పేంటి…?

-

పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్ గా మారి బాలీవుడ్ లో సెక్సీ బాంబ్ గా ఒక వెలుగు వెలుగుతున్న నటి సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమెకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని ఐటెం సాంగ్స్ తో పాటుగా కొన్ని సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మీడియా రాసిన ఒక కథనం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. సన్నీ లియోన్ నెంబర్ ని 73 ఏళ్ళ కబీర్ బేడీ అడిగారట.

దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె ఫోటోలను చూసి అభినందించి, ఆ సమయంలో సన్నీ లియోన్ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడగగా ఆమె కాస్త వినూత్నంగా ఆలోచించి తన భర్త డేనియల్ వెబర్ మొబైల్ నెంబర్ ఇచ్చిందట. ఇక తన భర్త నెంబర్ ఇవ్వడంతో కబీర్ బేడీని సన్నీ లియోన్ ని అవమానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు ఆయనకు ఆమె నెంబర్ ఎందుకు అంటూ మీడియా ప్రశ్నించింది.

దీనిపై స్పందించారు కబీర్ బేడీ… తన పరువుకి కథనాలు భంగం కలిగించాయని, సన్నీ పర్సనల్ నెంబర్ అసలు అడగలేదని, దబూ రత్నాని ఫోటోషూట్ కార్యక్రమంలో సన్నీ లియోన్ భర్త డేనియల్ ఫోన్ నెంబర్ అడిగా అని, స్వయంగా అతనే తన ఫోన్‌లో నెంబర్‌ను సేవ్ చేసారు అని చెప్పారు. వాటి మీద తనకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఆ రాతలు డిలీట్ చెయ్యాలని కోరారు.

దీనిపై సన్నీ భర్త వెబర్ కూడా స్పందించారు. కబీర్ బేడి, సన్నీ లియోన్ మధ్య చాలా ఏళ్ల పరిచయం ఉందన్న ఆయన, కబీర్ బేడి దగ్గర సన్నీ నెంబర్ ఉందని, ఆయన తన ఫోన్ నెంబర్‌ను ఎందుకు అడగకూడదని, స్టోరీ కోసం ఇంతలా దిగజారకూడదంటూ మండిపడ్డారు. దీనిపై ఆయన ట్వీట్ కూడా చేసారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version