నటుడు తొట్టెంపూడి వేణు ఇంట్లో విషాదం

-

టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) ఇవాళ ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన నివాసంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.  వేణు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇక వేణు విషయానికి వస్తే 1999లో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం అనే సినిమాతో వెండితెర ప్రస్థానం మొదలు పెట్టాడు. తొలి సినిమాకే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇలా వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన వేణు 2013లో వచ్చిన రామాచారి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. 2022లో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే అదితి అనే వెబ్సిరీస్తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు వేణు.

Read more RELATED
Recommended to you

Latest news