మనసుకు నచ్చిన పని చేయడంలో వచ్చే ఆనందమే వేరు. ఎందుకంటే.. ఆ పని ఎంత కష్టమైనా..మీకు అలసట అనిపించదు. రోజు రోజుకు ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. సంతృప్తిని ఇస్తుంది. జీతం కోసం చేసే ఉద్యోగాల్లో ఆనందం ఉండదు. ఆ విషయం అందరికి తెలుసు. నెలాఖరున పడే జీతం కోసం నెలంతా ఎదురుచూసేవాళ్లు ఎందరో..! ఈ ప్రపంచంలో చాలా మంది.. మనసుకు నచ్చిన పని చేస్తూనే లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి ఓ అమ్మాయి స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిస్టా కాఫీ కేఫ్‌లో కాఫీ తయారుచేసే 28 ఏళ్ల గ్రేస్ బట్టరీ బారిస్టా. ఈమె నార్విచ్‌లో నివసిస్తుంది. ఈ పని కోసం చాలాసార్లు గంటల తరబడి ఉండాల్సి రావడంతో అక్కడ సరైన డబ్బులు కూడా లభించలేవి కావట. ఆమె తనకు టైమ్ దొరికినప్పుడల్లా.. తన కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేది..అలా ఒకరోజు తన స్నేహితుడితో కలిసి వెళ్తున్నప్పుడు. నీకు డాక్‌తో వాకింగ్ చేయడం అంటే ఇష్టం కదా.. ఇదే వృత్తిగా ఎందకు మార్చుకోకూడదు అని సరదాగా అన్నాడట.. ఆమె దాన్ని సీరియస్‌గా తీసుకుంది.. ఆ జాబ్‌కు రాజీనామా చేసి..కొత్త లైఫ్‌ను స్టాట్ చేసింది.
2019 సంవత్సరంలో ఆమె తన స్వంత కంపెనీని ప్రారంభించింది. ఆమె ప్రతిరోజూ ఆరు గంటల పాటు ప్రజల కుక్కలను నడపడానికి తీసుకెళ్లేది.. కుక్కల యజమానులు ఆమెకు డబ్బులు ఇస్తారు. మొదట్లో ఇద్దరు, నాలుగురు కస్టమర్లు మాత్రమే ఉండేవాళ్లు.. కానీ ఇప్పుడు వందల మంది కస్టమర్లు ఉన్నారట. దీని వల్ల ఆమె 42 వేల పౌండ్లను సంపాదిస్తుంది.. ఈ ఖర్చులు పోతే దాదాపు రూ.34 లక్షలు మిగులుతుందట.
డాగ్ వాకర్‌గా ఉండటం దాని సొంత సవాళ్లను కలిగి ఉందని గ్రేస్ అంటోంది..అయినా ఈ పని చేయడం అంటే తనకు ఇష్టం కాబట్టి.. ఎటువంటి సమస్య ఉండదట.. ఖర్చులు ఉన్నప్పటికీ.. నాకు డబ్బులు మిగులుతున్నాయి.. అంతకంటే ఎక్కువ ఆనందం ఉందని ఆ మహిళ చెబుతోంది.