టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ తన భర్త, నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్యపై తొలిసారి స్పందించారు. ఆ ఘటనకు తాను బాధ్యురాలిని కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను హోస్ట్ ‘అప్పుల బాధ తట్టుకోలేక నితిన్ చనిపోయారు. దానికి జయసుధ కారణమంటూ అప్పట్లో వార్తలొచ్చాయి..’ అని ప్రస్తావించగా జయసుధ సమాధానం ఇచ్చారు.
సినిమా వాళ్ల విషయంలో కొందరు తమకు ఏది అనిపిస్తే అది రాసేస్తుంటారని, నిజం తెలుసుకోరని జయసుధ అన్నారు. తమకు అప్పులు లేవని, వాటిని తీర్చలేక ఆయన సూసైడ్ చేసుకున్నారనేది నిజం కాదని స్పష్టం చేశారు. నితిన్ సోదరుడు, వారి బంధువులైన ఇద్దరు మహిళలు కూడా ఆత్మహత్య చేసుకున్నారని, ఎప్పుడో ఒకప్పుడు నితిన్‌కు ఇలా జరుగుతుందని అనుకున్నామని తెలిపారు. తాను, తమ అత్తగారు దాన్ని ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించామని, కానీ, ఆయన్ను కాపాడుకోలేకపోయామని స్పష్టం చేశారు. రాబోయే తరాలకు ఈ పరిస్థితి ఉండకూడదని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని జయసుధ అన్నారు.