పెళ్లి తర్వాత మరింత గ్లామరస్ గా మారిన నటి పూర్ణ.. ఫోటోలు వైరల్..!

-

సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు పూర్ణ . మొదట్లో వరుస అవకాశాలను అందుకొని హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. తర్వాత సినిమాలలో ఆఫర్లు తగ్గినప్పుడు బుల్లితెరపై పలు టీవీ షో లు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ముందుగా తెలుగు తెరకు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సీమటపాకాయ్ సినిమా ద్వారా బాగా పాపులారిటీ అయిన పూర్ణ ఆ తర్వాత అవును సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. రవి బాబు దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2 సినిమాల ద్వారా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

అవకాశాలు కనుమరుగైనప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సిల్లీ ఫెలోస్ , అఖండ, దృశ్యం2 వంటి చిత్రాలలో కూడా నటించింది. ఇదిలా ఉండగా ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ఎట్టకేలకు దుబాయ్ లో వివాహం చేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలను అందరికీ షేర్ చేసి ఆశ్చర్యాన్ని కలిగించింది.

దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. పెళ్లి సందర్భంగా పూర్ణ భర్త నుంచి పొందిన కానుకలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను ఈమెకు కానుకగా ఇచ్చారు ఆసిఫ్ అలీ.

అయితే ఈయన ఎవరో కాదు దుబాయ్ కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ సీఈవో షానిద్ అలీ ని వివాహం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే వివాహం అనంతరం మొదటిసారి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి.పింక్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 

Read more RELATED
Recommended to you

Latest news