రూ.2000 నోట్లు ఇక కనిపించవట..కారణం ఇదే?

-

ఆరేళ్ళ క్రితం మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు పై కీలక నిర్ణయం తీసుకుంది.. దాంతో పెద్ద నోట్లు రద్దు చేసి,వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకుని వచ్చింది.అప్పటి నుంచి కొత్త 2000 రుపాయల నోట్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ మధ్య కాలంలో ఆ నోట్ల ముద్రణ కూడా నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది. గత మూడేళ్లలో ఒక్క రూ.2000 నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో 2000 రూపాయల కొత్త నోట్లను ముద్రించలేదు. 2016-17 నుంచి 2000 నోట్ల ముద్రణలో భారీ తగ్గిపోయింది.

 

ఆర్టీఐ కింద దాఖలైన అభ్యర్థనకు వచ్చిన సమాధానం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016లో రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత. ఈ రూ. 2,000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‍బీఐ) తీసుకొచ్చింది. అసలు, నకిలీ నోట్ల మధ్య తేడాను ప్రజలు సులువుగా గుర్తించేలా సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 2,000 నోటును రూపొందించింది.2019-20 నుండి ఈ సంఖ్య తగ్గిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2016-17, 2018-19 మధ్య ముద్రించిన అవే నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్నాయి. ఇందులో ప్రజల చేతిలో 2000 నోట్లు చలామణి కావడం చాలా తక్కువ అయిపోయింది.

ఎందుకంటే 2000 నోట్లు చాలా వరకు బ్యాంకుల వద్ద ఉన్నాయి. మే నెలలో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం సిస్టమ్‌లోని మొత్తం 2000 నోట్ల విలువ మార్చి 2021 నాటికి 22.6 శాతానికి, మార్చి 2022 నాటికి 13.8 శాతానికి తగ్గింది.ఈ ఏడాది మార్చి 22 నుంచి పూర్తిగా ముద్రించడాన్ని ఆపెసింది..ప్రస్తుతం సామాన్యుల షాపింగ్ లో పది, ఇరవై, యాభై రూపాయల లోపు సరుకుల ప్యాకెట్లే ప్రధానం కాబట్టి సరిపడా 100, 500 నోట్లను చలామణిలో ఉంచడం వల్ల పనులు సాగుతున్నాయి. అదే సమయంలో సిస్టమ్‌లోని నోట్లు సరిపోతాయి..

ఇంకా చెప్పాలంటే ఈ నోట్ల ముద్రణ ఆపెస్తె నల్ల దనం బయటకు వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతానికి, 2000 నోటుకు సంబంధించి తదుపరి వ్యూహాన్ని రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వం వెల్లడించలేదు. ముందుగా ముద్రించిన 2000 నోట్లు చలామణిలో ఉండొచ్చుగానీ, డేటా ఆధారంగా అయితే రానున్న కాలంలో 2000 నోట్లను జేబులో పెట్టుకునే అవకాశాలు తక్కువ అని నిపుణులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news