కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి రకుల్ ప్రీత్ సింగ్..!

-

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ నిన్న కేటీఆర్ తో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన నాగచైతన్య, సమంత, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్  గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  దీంతో ఇప్పటికే నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు.

తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. “తెలుగు చలన చిత్ర పరిశ్రమ క్రియేటివిటీ,  వృత్తి నిబద్ధతతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాది గొప్ప ప్రయాణం. ఇప్పటికీ ఇండస్ట్రీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. ఒక మహిళ గురించి నిరాధార ఆరోపణలు చేయడం విని బాధగా అనిపించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళా ఇలా వ్యాఖ్యానించడం మరింత నిరుత్సాహపరిచింది. నా ఏవ్యక్తి, రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం నా పేరును ఉపయోగించవద్దని కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version