కంగ‌నాపై మండిప‌డిన ఊర్మిళ‌

-

కంగ‌నా ర‌నౌత్ కావాల‌నే త‌నేదో బాధితురాలు అన్న‌ట్లు డ్రామాలాడుతుంద‌ని కాంగ్రెస్ నాయ‌కురాలు, రంగీలా ఫేమ్ ఉర్మిలా మటోండ్కర్ మండిప‌డ్డారు. ముంబైపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కంగ‌నా.. త‌న స్వ‌స్థ‌లం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ మాద‌క‌ద్ర‌వ్యాలకు మూలం అన్న సంగ‌తి తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియా అంటూ విరుచుకుప‌డుతున్న కంగ‌నా మొద‌ట త‌న పోరాటాన్ని సొంత రాష్ర్టం నుంచే ప్రారంభించాల‌ని తెలిపారు. పెద్ద‌గా నోరేసుకొని మాట్లాడినంత మాత్రానా ఆమె మాట్లాడేవ‌న్నీ నిజాలు అయిపోవ‌ని ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల ట్యాక్స్ డ‌బ్బుల‌తో వై-ప్ల‌స్ క్యాట‌గిరీ అనుభ‌విస్తున్న కంగ‌నా డ్ర‌గ్స్ గురించి తెలిసిన వెంట‌నే పోలీసుల‌కు ఎందుకు స‌మాచారం ఇవ్వ‌లేదంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news