బోడకొండలో ‘లవ్‌స్టోరీ’ సందడి

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో తాజాగా తెర‌కెక్కుతున్న సినిమా ‘లవ్‌స్టోరీ’… ఈ సినిమా సన్నివేశాలు బోడకొండ వాటర్‌ పాల్స్‌ వద్ద శనివారం చిత్రీకరించారు.

వాటర్‌ ఫాల్స్‌లో నాగ చైతన్య – సాయి పల్లవీ ఆడుతున్నట్లు సన్నివేశాలను, అలాగే గుట్టల్లో వారు బైక్‌పై విహరిస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ లవ్‌ స్టోరీ సినిమాలో ప్రాధానమైన ప్రేమకు సంబంధించి సన్నివేశాలు ఇక్కడే తీశారు. ఈ సినిమా షూటింగ్‌తో బోడకొండ– చెన్నారెడ్డి గూడ మధ్య ఉన్న గుట్టలు జనసందడిగా మారాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి షూటింగ్‌ను వీక్షించారు.