సీనియర్ హీరోతో కమిటైన అదా శర్మ

-

పూరి తీసిన హార్ట్ ఎటాక్ సినిమాతో కుర్రాళ్లకు నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేసిన అదా శర్మ కెరియర్ సరిగా సెట్ చేసుకోలేకపోయింది. అందం అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదని చెప్పాలి. అడపాదడపా సినిమాలు చేస్తున్నా కేవలం అర కొర అవకాశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేటెస్ట్ గా సీనియర్ హీరో సరసన నటించేందుకు సై అని చెప్పిందట అదా శర్మ.

ఈమధ్య ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న అదా శర్మ యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ నటిస్తున్న కల్కి సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కాన్సెప్ట్ తో కూడిన మోషన్ టీజర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పిఎస్వి గరుడవేగ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన రాజశేఖర్ మరోసారి కల్కి సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.

ఛాన్స్ వస్తే ఎలాంటి సినిమా అయినా చేసేలా ఉన్న అదా శర్మ ఈ లక్కీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాతో అదాకు ఏమాత్రం లక్ కలిసి వస్తుందో చూడాలి. ఇదే కాకుండా బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తుంది అదా శర్మ. మరి ఈ ప్రయత్నాలైనా అమ్మడిని మళ్లీ ఫాంలోకి వచ్చేలా చేస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news