‘ఆదిపురుష్‌’ కాంట్రవర్సీ.. కాఠ్‌మండూలో ఇండియన్ మూవీస్ నిషేధం

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాఘవరాముడిగా.. కృతి సనన్ సీతగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ వివాదాల్లో కూరుకుపోతోంది. సీత.. నేపాల్​లో పడితే.. ఆ సినిమాలో భారత్​లో పుట్టినట్టు చూపించారంటూ నేపాల్ నేతలు మండిపడ్డారు. ఈ సన్నివేశాన్ని మార్చకపోతే.. కాఠ్మండూలో ఇండియన్ సినిమాలు ప్రదర్శించబోమని ఆ సిటీ మేయర్ ఆదిపురుష్ టీమ్​కు వార్నింగ్ ఇచ్చారు. ‘ఆదిపురుష్‌’తోపాటు ఇండియన్‌ సినిమాలన్నింటినీ సోమవారం నుంచి కాఠ్‌మాండూలో నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

‘‘సీత జన్మించిన ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని తొలగించాలని చిత్ర బృందానికి మూడు రోజుల క్రితం విజ్ఞప్తి చేశాం. సోమవారం నుంచి కాఠ్‌మండూ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని థియేటర్లలో ఈ సినిమాని ప్రదర్శించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఈ చిత్రాన్ని ఎలాంటి మార్పులు లేకుండా ప్రదర్శించినట్లయితే.. నేపాల్ జాతీయ గుర్తింపు, సార్వభౌమాధికారానికి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది’’ అని మేయర్‌ తమ మాతృభాషలో పోస్ట్‌ పెట్టారు. ఈ నిషేధం కాఠ్‌మండూ ప్రాంతానికే పరిమితమవుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news