27 ఏళ్ల తర్వాత రజిని క్రేజీ అటెంప్ట్

-

సూపర్ స్టార్ రజినికాంత్ ఈమధ్య సినిమాల స్పీడ్ పెంచారని చెప్పొచ్చు. 2.ఓ ఇలా వచ్చి అలా వెళ్లిందో లేదో పేట అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడు రజినికాంత్. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వచ్చిన పేట సినిమా రజిని స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. సినిమా కథ రొటీన్ గా అనిపించినా రజిని స్టైల్ బాగా ఎలివేట్ అయ్యేలా చేశాడు దర్శకుడు. ఇక ఈ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే మురుగదాస్ సినిమా మొదలుపెట్టనున్నాడు తలైవా.

మురుగదాస్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ మూవీలో రజిని పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథగా ఈ సినిమా ఉంటుందట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రజినికాంత్ పోలీస్ గా నటించి దాదాపు 27 ఏళ్లు కావొస్తుంది. అప్పట్లో వచ్చిన పాండియన్ సినిమాలో రజిని పోలీస్ గా కనిపించారు, ఇక ఇప్పుడు మళ్లీ మురుగదాస్ సినిమాలో అలా కనిపిస్తారట. రజిని చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ ఆడియెన్స్ ను ఎలా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news