తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అసలు పేరు పరిగె శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి చర్చ నడుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిని తన ఊరి పేరునే ఇంటి పేరుగా పిలుస్తారు. 1950, ఫిబ్రవరి 10 న ఆయన పోచారంలో జన్మించారు. 1969 లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత తన బీటెక్ ను మధ్యలోనే వదిలేశారు పోచారం. తర్వాత 1977 లో దేశాయిపేట సహకార సంఘం చైర్మన్ గా ఎంపికయ్యారు. అలా.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పోచారం.. ప్రస్తుతం తెలంగాణ రెండో అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికయ్యారు.