“ఆహ” లోకి “ఓరి దేవుడా”..?

-

విశ్వక్‌సేన్ క‌థానాయ‌కుడిగా వెంక‌టేష్ అతిథి పాత్రలో న‌టించిన ‘ఓరి దేవుడా’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ప‌తాకంపై తెర‌కెక్కడం, ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఓ మై కడవులే చిత్రానికి ఇది రీమేక్.

ఈ సినిమాతో మిథిలా పాల్కర్, ఆశాభట్ కథానాయికలుగా పరిచయమయ్యారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఫాంటసీ టచ్ తో నడుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ” జీవితంలో భరించలేని బాధ ఎదురైనప్పుడు ఓరి దేవుడా అంటూ నిట్టూర్చడం జరుగుతుంది. ఆ దేవుడిని సైతం నిందించడం జరుగుతుంది. జరిగిన పొరపాట్లు సరిచేసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటాం.

అలాంటి కోరికను ఒక యువకుడు కోరుకుంటే.. ఆ భగవంతుడు నిజంగానే అతనికి ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమా. అయితే ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ను “ఆహ” సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుండగా.. త్వరలోనే ఓటీటీ విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news