అఖిల్ మజ్నుకి భలే ఛాన్స్

-

అక్కినేని నట వారసుడిగా అఖిల్ మొదటి, రెండు సినిమాలు అఖిల్, హలో రెండు నిరాశపరచాయి. ఇక ఇప్పుడు మూడవ సినిమాగా రాబోతున్న మూవీ మిస్టర్ మజ్ను. ఈ నెల 25న గ్రాండ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా సినిమా మొత్తం యూరప్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిందని తెలుస్తుంది.

ఇక సంక్రాంతికి వచ్చిన సినిమాల సందడి మాములుగానే ఉంది. ఒక్క ఎఫ్-2 తప్ప మిగిలిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో లేవు. అందుకే ఈసారి అఖిల్ కు మంచి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇలాంటి టైంలో అఖిల్ హిట్ కొడితే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మిస్టర్ మజ్ను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సినిమా టీజర్, సాంగ్స్ అన్ని సినిమాపై పాజిటివ్ ఫీల్ కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ బాక్సాఫీస్ విజేతగా నిలుస్తాడా లేడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news