ఆరెక్స్ 100 సినిమాతో సత్తా చాటిన అజయ్ భూపతి తన సెకండ్ మూవీ ఎవరితో చేస్తున్నాడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే ఆరెక్స్ 100 తర్వాత రాం, నితిన్ లతో చర్చలు జరుపగా ఆ ఇద్దరు ఎందుకో తర్వాత అజయ్ ను కాదన్నారు. ఇక రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా వస్తుందని అనుకోగా అది కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ స్టోరీనే అక్కినేని హీరోతో చేయాలని చూస్తున్నాడట అజయ్ భూపతి.
మజిలీ సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్న నాగ చైతన్య సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా అజయ్ భూపతి చైతుని కలవడం జరిగిందట. చైతుకి లైన్ కూడా చెప్పాడట. జోష్ నుండి మజిలీ వరకు లవ్ స్టోరీస్ హిట్ కొడుకున్న చైతు మాస్ ఇమేజ్ కోసం కొన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. అందుకే అజయ్ భూపతితో ఓ మాస్ మసాలా మూవీని చేస్తున్నాడట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.