అక్ష‌య్ యేడాది సంపాద‌న చూస్తే క‌ళ్లు జిగేల్‌..!

399

బాలీవుడ్ లో వైవిధ్య భరితమైన సినిమాలతో మంచి హిట్లు సాధిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమారే. కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలతో అక్కి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇలా విజయాలు సాధిస్తున్న అక్షయ్ రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నాడు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ హీరోల్లో అక్కి ఎప్పుడు టాప్ లోనే ఉంటాడు.

Akshay Kumar World's 4th Highest Paid Actor on Forbes List
Akshay Kumar World’s 4th Highest Paid Actor on Forbes List

ఇలా బాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్న అక్కి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నాలుగవ నటుడిగా ఫోర్భ్స్‌ జాబితాలో నిలిచారు. అక్షయ్‌ కుమార్‌ జూన్ 1, 2018 నుంచి జూన్ 1, 2019 నాటికి ఏకంగా రూ. 466 కోట్లు ఆర్జించారని ఫోర్బ్స్‌ మేగజైన్‌ వెల్లడించింది. ఇక ఫోర్బ్స్ తొలి మూడు స్ధానాల్లో హాలీవుడ్‌ స్టార్లు ద్వాన్‌ జాన్సన్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌లు నిలిచారు.

కాగా, ఈ ఏడాది అక్షయ్‌ నటించిన రెండు సినిమాలు కేసరి, మిషన్‌ మంగళ్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. అలాగే హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌ న్యూస్‌ సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. అటు లక్ష్మీ బాంబ్‌, సూర్యవంశి, బచన్‌ పాండే వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే అక్షయ్ సినిమాల్లోనే కాకుండా ప్రకటనలపైనా భారీగా సంపాదిస్తున్నాడు. 20 ప్రముఖ బ్రాండ్లకు అక్షయ్ ప్రస్తుతం అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆర్జించడంలో కూడా అక్షయ్ టాప్ లోనే ఉన్నాడు.