అక్ష‌య్ వ‌ర్సెస్ ప్ర‌భాస్‌.. ధూమ్‌-4కోసం ఇద్ద‌రి పోటీ!

సినీ ఇండ‌స్ట్రీలో ధూమ్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ట‌పి వ‌ర‌కు వ‌చ్చిన ధూమ్-1 నుంచి మొద‌లుకుని ధూమ్ -3 సినిమా దాకా అన్నీ సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఈ సిరీస్‌పై వ‌చ్చిన సినిమాల‌న్నీ మేకింగ్ పరంగా అద్భుతాల్ని సృష్టించాయ‌నే చెప్పాలి. ధూమ్ సినిమా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల్లో చెర‌గ‌ని ముద్రేనే వేసుకుంద‌ని చెప్పాలి.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన వాటిల్లో మొద‌టి దాంట్లో జాన్ అబ్రహాం, ధూమ్‌-2లో హృతిక్ రోషన్, ఇక ధూమ్-3లో అమీర్ ఖాన్ లు నటించి బాక్స్ ఆఫీస్ వ‌ద్ద దుమ్ము లేపారు. ఇక ఇదే క్ర‌మంలో ధూమ్‌-4కు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. యాక్షన్ అడ్వైంచైర్ రూట్లో ఈ మూవీల‌కు వరల్డ్ వైడ్ గా అభిమానులున్నారు.

ఇక ఇప్పుడు దీనిక సీక్వెల్‌గా ధూమ్‌-4ను తీయాల‌ని భావిస్తున్నారు.అయితే ఈ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తోపాటు కిలాడీ హీరో అయిన అక్షయ్ కుమార్ పేర్లు ప్ర‌ధానంగా వినిపించాయి. కానీ ఇప్పుడు హృతిక్ రోషన్ స‌హా డార్లింగ్ ప్రభాస్ పేర్లు కూడా వ‌స్తున్నాయి. కాక‌పోతే ఇందులో ఎవ‌రు అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అక్ష‌య్ కుమార్ లేదా ప్ర‌భాస్ పేర్లు మాత్ర‌మే బ‌లంగా వినిపిస్తున్నాయి. చూడాలి మ‌రి ఎవ‌రు న‌టిస్తారో.