ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల అంటే మంచి కాఫీ లాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. అలాంటి డైరెక్టర్ ఇప్పటి వరకు మన తెలుగు స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. కేవలం మిడిల్ రేంజ్ హీరోలతో మాత్రమే చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఓ సెన్సేషనల్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు. అదే కోలీవుడ్ హీరో ధనుష్‌తో చేస్తున్న సినిమా.
ఇక ఈ మూవీపై ధనుష్ ఇప్పటికే ఫుల్ ఇంప్రెస్‌గా ఉన్నాడు. కాగా ఈ మూవీని కూడా మూడు భాషల్లో తీస్తున్నారు. ప్యాన్ ఇండియన్ సినిమాగానే ఇదీ తెరకెక్కుతోంది. ఆయన చేస్తున్నీ అప్‌కమింగ్ ఫీట్ ఇండస్ట్రీకి బిగ్ సర్‌ప్రైజ్ అనే చెప్పాలి.
ఎందుకంటే ఆయన తెలుగు స్టార్ హీరోలతో చేయకుండా ఏకంగా పక్క రాష్ట్రంలోని స్టార్ హీరోతో చేయడమే ఇక్కడ పెద్ద ట్విస్టు గా మారింది. మరి మన స్టార్ హీరోలు శేఖర్‌ను పట్టించుకోవట్లేదా లేక ఆయనే వద్దనుకుని మరీ వేరే ఇండస్ట్రీ హీరోను నమ్ముకుంటున్నారా అనేది ఆయన అభిమానుల క్వశ్చన్. ఏదేమైనా ఇది మాత్రం బిగ్ సర్‌ప్రైజెస్ అనే చెప్పాలి. మరి ధనుష్ నమ్మకాన్ని శేఖర్ నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.