అల వైకుంఠపురంలోతో హ్యాట్రిక్ కొట్టిన, బన్ని త్రివిక్రమ్…!

-

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్ర౦ ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నా పేరు సూర్యా ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ చేసిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. త్రివిక్రం, బన్ని ఇద్దరు హ్యాట్రిక్ కొట్టారని అంటున్నారు ప్రేక్షకులు.

ఈ సినిమా అటు మాస్ ఇటు క్లాస్ ని ఆకట్టుకుందని,త్రివిక్రమ్ మార్క్ దర్శకత్వం ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చిందని అంటున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు విశేష స్పందన రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అటు విదేశాల్లో కూడా మంచి ఆదరణ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది అంటున్నారు.

ప్రతీ సీన్ కూడా జాగ్రత్తగా తెరకెక్కించారని, ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టలేదని అంటున్నారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్, బన్ని కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ నటన విశేషంగా ఆకట్టుకుంది. అటు త్రివిక్రమ్ కూడా తన మార్క్ పంచ్ లతో ఫాన్స్ ని ఖుషీ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news