‘అల వైకుంఠపురములో’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ….!!

-

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలవైకుంఠపురములో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బన్నీ సరసన రెండవ సారి పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా కావడంతో దీనిపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

ala vaikunta puram lo drops on release date
ala vaikunta puram lo drops on release date

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వీక్షకుల ముందుకు వచ్చిన మూడు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ సంపాదించి, సినిమా పై బాగా అంచనాలు పెంచడం జరిగింది. ఇటీవల ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ దక్కించుకోగా, నేడు ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా నుండి నాలుగవ సాంగ్ మరియు మూవీ టీజర్ ఈ వారం లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

 

బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో, అదే కంపెనీ సీఈవోగా పూజ హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన తండ్రి పాత్రలో మురళి శర్మ నటిస్తున్నారు. ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కలగలిపి త్రివిక్రమ్ స్టైల్ అఫ్ పంచ్ డైలాగులతో ఒక పవర్ ప్యాక్డ్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, రాహుల్ రామకృష్ణ, నవదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది……!!

Read more RELATED
Recommended to you

Latest news