హాలీవుడ్ హీరోయిన్ కు తెలుగు నేర్పిన బాలీవుడ్ బ్యూటీ

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు తన ఫస్ట్ హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది ఆలియా. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆలియా.. హాలీవుడ్ హీరోయిన్ గాల్ గాడోట్ కు తెలుగులో మాట్లాడ్డం నేర్పించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నటి గాల్ గాడోట్​కి ‘అందరికి నమస్కారం.. మీకు నా ముద్దులు..’ అని పలకడం నేర్పింది ఆలియా భట్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. తెలుగులో క్యూట్​గా మట్లాడారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్​ నటించిన కొత్త హాలీవుడ్ చిత్రం ‘హార్ట్​ ఆఫ్ స్టోన్’..​ ఆగస్టు 11న నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. అలియా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news