టమాట.. నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే సామాన్యులు బెంబేలెత్తిపోయేవారు. ఎందుకంటే ధరలు ఆ రేంజ్లో ఉండేవి. ఏకంగా రూ.300 వరకు చేరింది కిలో టమాట ధర. ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు కిలో టమాట ధర రూ.150 వరకు గరిష్ఠంగా ఉంది. అయితే హైదరాబాద్లో తాజాగా ఈ కూరగాయ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
నిన్న మొన్నటిదాకా బహిరంగ మార్కెట్‌లో రూ.200కిలో పలికిన టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. నగంరోలని మెహిదీపట్నం రైతుబజార్‌లో సోమవారం కిలో టమాటా రూ.63గా ధర నిర్ణయించారు. మరోవైపు.. గుడిమల్కాపూర్ మార్కెట్‌రోడ్డులో కిలో టమాటా(గోటి) రూ.50లకు విక్రయించారు. ఇక్కడే ఆటోల్లో మొదటి రకం టమాటా రూ.90 కిలో అంటూ బోర్డు పెట్టి అమ్మకాలు సాగించారు. నెలాఖరు వరకు ధరలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పారు. టమాట ధరలు తగ్గుముఖం పడుతుండటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కూరల్లో టమాటను వాడేయొచ్చని సంతోషం వ్యక్తం చేశారు.