ప్రభాస్‌కి చాలెంజ్ విసురుతోన్న ఆలియా భట్

Join Our Community
follow manalokam on social media

ప్రభాస్‌తో ఫైటింగ్ ఎందుకని స్టార్ హీరోలు కూడా డార్లింగ్‌కి దారి ఇచ్చేస్తున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ప్రభాస్‌కి సవాల్ విసురుతోంది. నెక్‌ టు నెక్‌ ఫైటింగ్‌కి దిగుతోంది. మరి ‘బాహుబలి’ని చాలెంజ్‌ చేస్తోన్న హీరోయిన్ పై టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. బాలీవుడ్‌లో కూడా ప్రభాస్‌కి సెపరేట్‌ మార్కెట్‌ క్రియేట్ అయ్యింది. అందుకే ప్రభాస్‌ సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలామంది హీరోలు, ఆ డేట్‌ని డార్లింగ్‌కే వదిలేస్తున్నారు. ఓపెనింగ్స్‌ డివైడ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఆలియా భట్‌ మాత్రం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’తో పోటీ పడుతోంది.

ఆలియా భట్‌కి బాలీవుడ్‌లో యూనిక్‌ ఇమేజ్ ఉంది. స్ట్రాంగ్‌ రోల్స్‌ ప్లే చేస్తుందని, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో అదరగొడుతుందనే ఒపీనియన్ ఉంది. ఈ నమ్మకంతోనే ఆలియా భట్‌తో ‘గంగూబాయ్‌ కఠియావాడి’ సినిమా తీశాడు సంజయ్‌లీలా భన్సాలి. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి’ పుస్తకం ఆధారంగా ‘గంగూబాయ్’ కథాంశాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీలో ఆలియా భట్‌ టైటిల్‌ రోల్ ప్లే చేసింది.

‘గంగూబాయ్’ సినిమా ఈ ఏడాది జులై 30న రిలీజ్ అవుతోంది. ఇక ఇదే డేట్‌ని ప్రభాస్‌ కూడా లాక్ చేసుకున్నాడు. ప్రభాస్ లాంగ్‌ గ్యాప్‌ తర్వాత చేసిన లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’ జులై 30నే వస్తోంది. దీంతో నార్త్ మార్కెట్‌లో ‘రాధేశ్యామ్’ వసూళ్లపై ‘గంగూబాయ్’ ఎఫెక్ట్ ఉంటుందని, ప్రభాస్‌కి దెబ్బ పడుతుందని చెప్తున్నారు ట్రేడ్ పండిట్స్.

ప్రభాస్‌ ‘సాహో’ సినిమాకి సౌత్‌ కంటే నార్త్‌లోనే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, హిందీలో మాత్రం ఈ సినిమా వందకోట్లకు పైగా షేర్ కలెక్ట్‌ చేసింది. హిందీ వసూళ్లతోనే ‘సాహో’ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిందని ట్రేడ్ టాక్. ఇలా ప్రభాస్‌కి సేఫ్‌ ప్లేస్‌గా మారిన బాలీవుడ్‌లో ఇప్పుడు ఆలియా భట్‌ ఎదురొస్తోంది. మరి ‘గుంగుబాయ్’ని ఎదుర్కొని, ‘రాధేశ్యామ్’ ఎంత కలెక్ట్‌ చేస్తుందో చూడాలి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...