8 లక్షల గౌనులో ప్రియాంకా చోప్రా..!

-

బాలీవుడ్ ప్రియాంకా చోప్రాకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత కూడా అమ్మడు అదే రేంజ్ ఫాలోయింగ్ కొనసాగిస్తుంది. కేవలం సినిమాలతోనే కాదు తన ఫోటో షూట్స్ ఇంకా కాస్ట్లీ కాస్టూమ్స్ తో తన స్పెషాలిటీ చాటిచెబుతుంది ప్రియాంకా చోప్రా. లేటెస్ట్ గా వింటర్ గాలా-2019లో ప్రియాంకా 8 లక్షల గౌనుతో అందరిని సర్ ప్రైజ్ చేసింది ప్రియాంకా. కేవలం డబ్బు ఒకటి మాత్రమే పెడితే సరిపోదు తాము వేసుకునే దుస్తుల మీద మంచి అవగాహన కూడా ఉండాలి. అది ప్రియాంకాకు బాగా ఉన్నట్టుంది.

స్ప్రింగ్ ఆర్టీ డబల్యు కలక్షన్స్ లో డిజైన్ చేయబడిన ఈ డ్రెస్ ను స్టయిలిస్ట్ మిమీ కత్రెల్ రూపొందించారట. ఈ కాస్టూం ధర 11410 డాలర్స్ కాగా మన కరెన్సీలో 8 లక్షల దాకా ఉంటుందట. హాలీవుడ్ లోకి అడుగుపెట్టాక బాలీవుడ్ సినిమాలను పెద్దగా పట్టించుకోని ప్రియాంకా చోప్రా ప్రస్తుతం ఆనంద్ షీలా బయోపిక్ గా వస్తున్న సినిమాలో నటించడాంకి సిద్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news