అల్లు అరవింద్ స్మాల్ బడ్జెట్ మూవీస్..!

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. ఆయన సినిమా అంటే తప్పకుండా అంచనాలుంటాయి. ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాలనే చేసే అల్లు అరవింద్ ఈమధ్య గీతా ఆర్ట్స్-2 అని పెట్టి తన సమర్పణలో బన్ని వాసు నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈసారి డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నాడట అల్లు అరవింద్.

సమర్పకుడిగా కాకుండా ఈసారి అల్లు అరవింద్ డైరెక్ట్ గా స్మాల్ బడ్జెట్ సినిమా చేయాలని చూస్తున్నాడట. అంతా కొత్త వారితో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే కథ ఫైనల్ కాగా త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. మరి అల్లు అరవింద్ చేయబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దానికి సమబందించిన విషయాలేంటో తెలియాల్సి ఉంది.