అల వైకుంఠపురములో ఫస్ట్ రివ్యూ.. సూపర్ హిట్ ఎమోషనల్ ఫామిలీ డ్రామా

-

సినిమా : అల వైకుంఠపురములో

ala vaikunthapurramuloo movie Review  : Manalokam

విడుదల తేదీ : జనవరి 12 , 2020

Manalokam రేటింగ్ : 3.5 /5

నటీనటులు : అల్లూ అర్జున్ , పూజ హెగ్డే , టబూ , మురళీ శర్మ , సునీల్

దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత‌లు : అల్లూ అరవింద్ , రాధాకృష్ణ

సంగీతం : తమన్

ala vaikunthapurramuloo movie Review  Manalokam :

ala vaikunthapurramuloo movie review
ala vaikunthapurramuloo movie review

అల్లు అర్జున్ సినిమాలు అనగానే తెలుగు ప్రేక్షకులకి ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఫాక్టర్ ఉంటుంది . దానికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. బన్నీ సినిమాల విషయంలో ఎప్పుడూ తనదైనటువంటి ఒక ప్రత్యేక శైలిని కనబరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ దగ్గర నుంచి, తన సినిమా కోసం సాంకేతిక బృందాన్ని ఎన్నుకోవడం దగ్గర నుంచి .. పాటలు డాన్స్ – ఫైట్లు ఇలా అనేక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం అతని స్పెషాలిటీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ కొత్త సినిమా వీరి కాంబినేషన్లో మూడో సినిమా కావడంతో హ్యాట్రిక్ కొట్టాలని చాలా మంది కోరుకోవడం తో అల వైకుంఠ పురం లో సినిమా అల వైకుంఠపురములో మీద అత్యంత భారీ స్థాయిలో ఏర్పడింది. ట్రైలర్ కూడా కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది .. దీంతో ఈ సినిమా థియేటర్ లో ఎలా ఉంటుంది అని అందరికీ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఈ చిత్ర బృందం వారు అనుకున్న మేరకు ఈ సినిమాని పర్ఫెక్ట్ గా చూపించారా లేక ఏవైనా లోపాలు ఉన్నాయా ఒక్కసారి చూద్దాం రండి.

కథ – విశ్లేషణ 

కథ – విశ్లేషణ : ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడి ఆలోచనలూ – అతని ఊహాలూ – అతని తండ్రి సెంటిమెంట్ తో మొదలవుతుంది స్టోరీ .. . అయితే అల్లూ అర్జున్ ని సుశాంత్ ని మురళీ శర్మ చిన్నతనం లోనే ఎక్స్ఛేంజి చేస్తాడు .. అర్జున్ మిడిల్ క్లాస్ ఇంట్లో – సుశాంత్ ఉన్నవాళ్ల ఇంట్లో పెరుగుతారు . తన సొంత స్థానానికి హీరో మళ్ళీ ఎలా వెళ్లగలిగాడు అనేది కథ . ఇంటెర్వెల్ బ్లాక్ తో ప్రేక్షకులని కట్టి పడేశాడు త్రివిక్రమ్. కామెడీ + యాక్షన్ + ఎంటర్టైన్మెంట్ లో తన కి ఉన్న ఫుల్ టాలెంట్ ని త్రివిక్రమ్ ఈ సినిమా తో బయటకి తీశాడు . అసలు సినిమా మొదలైన ముప్పై నిమిషాల్లో త్రివిక్రమ్ తన మార్క్ ని చూపించే ప్రయత్నం లో సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాడు. ” ఇంట్లో దీపం పెడితే అది ఒక్క ఆ ఇంటికే , అదే గుడిలో పెడితే ఊరంతటికి ‘ ‘ చేతిలో చిల్లర లేదు , పెద్ద నోటు ఏమో ఇవ్వలేను ‘ ఇలాంటి డైలాగులతో వింటేజ్ గా సినిమా ని నడిపించాడు . తాను ఏ ఫామిలీ డ్రామాల జోనర్ తీయడం లో త్రివిక్రమ్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటాడో అలాంటి కథే ఎంచుకుని బలం ఇచ్చాడు సబ్జెక్ట్ కి . ఫామిలీ ఆడియన్స్ కి బాగా కనక్ట్ అయ్యేలా ఎమోషన్లని జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు .. అదే సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అయ్యింది.

ala vaikunthapurramuloo movie review
ala vaikunthapurramuloo movie review

ప్లస్ పాయింట్ లు 

చాలా సింపుల్ కథ ని డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం , కథనాన్ని నడిపిన తీరు ఈ సినిమాకి పెద్ద ఆస్తి .. స్క్రీన్ ప్లే విషయం లో స్ట్రాంగ్ రా కథనం రాసుకున్నాడు డైరెక్టర్ . హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయ్యింది. నేపధ్య సంగీతం తో తమన్ అద్భుతమైన బాణీలు ఇచ్చాడు . ఫైట్స్ దగ్గర తమన్ మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది . అల్లూ అర్జున్ ఈ సినిమా మొత్తాన్నీ వన్ మ్యాన్ షో తో నడిపించాడు . కామెడీ , సెంటిమెంట్ , డాన్స్ లూ , ఫైట్ లూ , సెటైర్ లూ , రౌద్రం .. ఇలా అనేక చోట్ల తన నటన తో ఆకట్టుకున్నాడు. సినిమా ఎక్కడ డౌన్ అయిపోతోంది అనిపించినా అల్లూ అర్జున్ పూర్తిగా కవర్ చేసుకుంటూ వచ్చాడు .. కామెడీ లో తాను స్ట్రాంగ్ అని త్రివిక్రమ్ మళ్ళీ నిరూపించుకున్నాడు. డైలాగుల విషయం అయితే ఇక్క చెప్పక్కరలేదు ఉదాహరణ కి .. మొదటి 20 నిమిషాల్లో దాదాపు 40 డైలాగులు వదిలాడు , అన్నీ క్వాలిటీ గా జనాల మనసులకి హత్తుకునేవే . బన్నీ రెడ్ సూట్ లో హడావిడి చేసే ఎపిసోడ్ సినిమా కి హైలైట్ గా నిలుస్తుంది. సెకండ్ హాఫ్ లో చిన్న డల్ మూమెంట్ కూడా లేకుండా చూసుకున్నాడు.

మైనస్ పాయింట్ లు

ఇంత సింపుల్ కథ కి అంతా తారాగణం అవసరం లేదు. అడపా దడపా ప్రేక్షకులకి అజ్ఞాతవాసి , రౌడీ అల్లుడు , జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు గుర్తు వస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కథ లో కాస్తంత సాగదీత కనిపిస్తుంది. అల్లూ అర్జున్ నటన ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కొన్ని చోట్ల ఓవర్ గా అనిపిస్తుంది. సునీల్ లాంటి టాలెంటెడ్ కమీడియన్ ని ఇంకా చక్కగా వాడుకోవాల్సింది . అరవింద సామెత లో కూడా ఏదో నామ్కే వాస్తే ఉన్నట్టు అనిపించింది అతని కారెక్టర్ ఇందులో అదే రిపీట్ అయ్యింది . త్రివిక్రమ్ లాంటి మంచి రైటర్ కూడా చాలా చోట్ల లాజిక్ లు మిస్ చెయ్యడం చాలా ఇబ్బంది అనిపించింది .

సాంకేతిక విభాగం

ఎడిటింగ్ విషయం లో సినిమా కాస్తంత గందరగోళానికి గురి అవుతారు ప్రేక్షకులు . సినిమాటోగ్రఫీ విషయం లో సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది అయితే కొన్ని కెమెరా యాంగిల్స్ ఇంకా వర్క్ అవ్వాల్సి ఉంది.. ఫైట్స్ విషయం లో టెక్నికల్ టీం కష్టం అంతా బయటపడింది. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అద్దిరిపోయే టేస్ట్ ఉన్న మ్యూజిక్ అందించాడు. తమన్ ఈ సినిమా కి రెండవ హీరో అని చెప్పచ్చు. అల్లూ అర్జున్ కాస్ట్యూమ్స్ , పూజా హెగ్డే అందాలు ఇవన్నీ కాస్ట్యూమ్ టీం వర్క్ ని చూపించాయి. త్రివిక్రమ్ టేస్ట్ కి తగ్గట్టుగా నే ఆర్ట్ టీం కూడా తమ కష్టం చూపించింది. సాంగ్స్ విషయం లో రిచ్ లుక్ కోసం అవసరం లేని గ్రాఫిక్స్ వాడేశారు.

తీర్పు

అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తరవాత అరవింద సమేత తో మంచి కం బ్యాక్ ఇచ్కిన డైరెటర్ త్రివిక్రమ్ ఈ సారి మళ్ళీ గ్రిప్ ని కాపాడుకున్నాడు .. బ్లాక్ బస్టర్ కథ తో అద్దిరిపోయే కథనం తో తెలివిగా సినిమా మొత్తం నడిపించాడు . ఇతనేనా అజ్ఞాతవాసి తీసింది అనిపించేలా అల్లూ అర్జున్ కెరీర్ కి మంచి బ్లాక్ బస్టర్ అందించాడు త్రివిక్రమ్ . సంక్రాంతికి ఊర్ల నుంచి వచ్చిన చుట్టలు , ఫ్రెండ్స్ తో చక్కగా చెయ్యదగ్గ సినిమా . గ్యాప్ తీసుకుని బన్నీ సంక్రాంతి కి పెద్ద సినిమా ని దింపడు .. బన్నీ బాక్స్ ఆఫీస్ రేంజ్ ని తదుపరి లెవెల్ కి తీసుకువెళ్లే చిత్రం ఇది . ..

Read more RELATED
Recommended to you

Latest news